
సాక్షి, న్యూఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఉమెన్ చాందీ గురువారం సమావేశయ్యారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత రాహుల్‌తో వీరు చర్చించారు.
ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ విధానంపై తాము చర్చించామని తెలిపారు. 175 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతల అభిప్రాయాలు రాహుల్‌కు వివరించామని, రానున్న ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని దానిపై వారంలో నిర్ణయం తీసుకుంటామరని తెలిపారు. ఏపీలో పొత్తులు పెట్టుకోవాలా లేక ఒంటరిగా పోటీ చేయాలన్న దానిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. రాష్ట్ర పార్టీలోనూ పొత్తు కావాలి, పొత్తు వద్దు అనే నాయకులు ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment