![Rahul Gandhi Promises Special Status To AP In 2019 - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/6/Rahul-Gandhi.jpg.webp?itok=7rISqnY0)
రాహుల్ గాంధీతో పళ్లంరాజు, రామకృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామియిచ్చారు. మంగళవారం ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నిర్వహించిన ఆత్మగౌరవ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అందరం కలిసికట్టుగా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ ఒక్క నిమిషంలోనే ప్రసంగం ముగించి వేదికపై దిగి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నాయకుడు మధు ఆత్మగౌరవ సభకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment