విశాఖపట్నం: ఆందోళనలు, నిరసనలు పట్టించుకోకుండా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మైనింగ్కు అనుమతిస్తూ జీవో నంబర్.97ను గురువారం సాయంత్రం విడుదల చేసింది. దీని ప్రకారం నర్సీపట్నంలోని రిజర్వ్ ఫారెస్ట్ డివిజన్లోని 1212 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చింది.
ఏపీఎండీసీకి మైనింగ్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడి మైనింగ్ కార్యక్రమాలు జరపాలని ఇందులో పేర్కొంది. దీంతోపాటు గిరిజనులు అధికంగా ఉండే చితపల్లి, జర్రెల అటవీ ప్రాంతంలో కూడా బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు అక్కడ ఉన్న గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. చాలా ఏళ్లుగా ఇక్కడ బాక్సైట్ తవ్వకాల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజనులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటిని పట్టించుకోకుండా తాజాగా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు, గిరిజన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో ఎదురు చూడాల్సిందే.
ఆందోళన బేఖాతరు.. బాక్సైట్ తవ్వకాలకు ఓకే
Published Thu, Nov 5 2015 4:36 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement
Advertisement