'బాక్సైట్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం'
Published Mon, Dec 28 2015 6:46 PM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
విశాఖపట్నం: కలెక్టర్ యువరాజ్ అధ్యక్షతన జరిగిన పాడేరు ఐటీడీఏ పాలక వర్గ సమావేశం మొక్కుబడిగా సాగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు పాల్గొనగా, మంత్రి రావెల కిషోర్ గైర్హాజరయ్యారు.
పాలక వర్గ సమావేశంలో గిరిరజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై చర్చించారు. కాగా, బాక్సైట్ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని గిడ్డి ఈశ్వరి తెలిపారు. రూ.5లక్షల కోట్ల సోమ్ము ప్రభుత్వానికి అవసరమా.. లేక లక్షల మంది గిరిజనుల సంక్షేమం అవసరమా అని కిడారి సర్వేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీవో నంబర్ 97ను రద్దు చేసేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని సర్వేశ్వరరావు స్పష్టంచేశారు.
Advertisement
Advertisement