అధికార పార్టీలో సభ్యులమైనప్పటికీ తాము కూడా గిరిజనులమేనని, పదవుల కన్నా తమ ప్రాంతం మాకు ముఖ్యమని మావోయిస్టుల చెరలో ఉన్న టీడీపీ నాయకులు ముక్కల మహేష్, మామిడి బాలయ్యపడాల్, వండలం బాలయ్య ప్రజా కోర్టులో స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రజాకోర్టులో ఆదివాసీలు ముగ్గురి అభిప్రాయాలను కోరగా ఇందుకు వీరు స్పందిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారమైనంత మాత్రాన తాము మన్యంలో పుట్టి పెరిగిన గిరిజనులమేనని, బాక్సైట్ తవ్వకాల వల్ల తాము కూడా నిరాశ్రయులమయ్యే పరిస్థితి నెలకొంటుందని, తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు ముందుంటామని హామీ ఇచ్చారు.
ఇందులో భాగంగానే ఈనెల 18న తమ పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి, పదవులకు పార్టీకి చెందిన వారంతా రాజీనామాలు చేస్తామని అన్నారు. దీంతో ఆదివాసీలు, మావోయిస్టులు శాంతించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు వారి అభిప్రాయాలతో ఏకీభవించి మావోయిస్టు నాయకులు ముగ్గురు నాయకులను విడుదల చేస్తున్నట్లు ప్రజాకోర్టులో ప్రకటించారు.
టీడీపీకి రాజీనామా చేసి బాక్సైట్‌పై ఉద్యమిస్తాం
Published Fri, Oct 16 2015 1:42 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement