విశాఖపట్నం: సీఎం చంద్రబాబు నాయుడుది ఏరుదాటాక తెప్పతగలేసే తీరని మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి బాబూరావు విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలపై ఎన్నికలకు ముందొక మాట, తర్వాత మరోమాట ఆయనకే చెల్లిందన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వీలుగా చంద్రబాబు సర్కార్ జారీచేసిన జీవో నంబర్ 97కు నిరసనగా అఖిలపక్షం పిలుపు మేరకు శనివారం విశాఖ మన్యం బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకుడు గొల్లపల్లి మీడియాతో మాట్లాడారు.
ఏపీలో మోసాలు, దోపిడీల పరంపర కొనసాగుతున్నదని, మన్యంలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం చేస్తున్న పోరాటంలో మంత్రులు కూడా కలిసిరావాలన్నారు. గిరజన హక్కులను కాపాడేందుకు వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాడుతుందని, అవసరమైతే ప్రాణత్యాగాలకు కూడా వెనకాడబోదని గొల్లపల్లి అన్నారు.
'చంద్రబాబుది ఏరుదాటాక తెప్పతగలేసే తీరు'
Published Sat, Nov 7 2015 11:37 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement
Advertisement