vishakha manyam bandh
-
మంత్రి గంటాకు విశాఖ మీద ప్రేముంటే..
-
'చంద్రబాబుది ఏరుదాటాక తెప్పతగలేసే తీరు'
విశాఖపట్నం: సీఎం చంద్రబాబు నాయుడుది ఏరుదాటాక తెప్పతగలేసే తీరని మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి బాబూరావు విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలపై ఎన్నికలకు ముందొక మాట, తర్వాత మరోమాట ఆయనకే చెల్లిందన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వీలుగా చంద్రబాబు సర్కార్ జారీచేసిన జీవో నంబర్ 97కు నిరసనగా అఖిలపక్షం పిలుపు మేరకు శనివారం విశాఖ మన్యం బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకుడు గొల్లపల్లి మీడియాతో మాట్లాడారు. ఏపీలో మోసాలు, దోపిడీల పరంపర కొనసాగుతున్నదని, మన్యంలో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా అఖిలపక్షం చేస్తున్న పోరాటంలో మంత్రులు కూడా కలిసిరావాలన్నారు. గిరజన హక్కులను కాపాడేందుకు వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాడుతుందని, అవసరమైతే ప్రాణత్యాగాలకు కూడా వెనకాడబోదని గొల్లపల్లి అన్నారు. -
మంత్రి గంటాకు విశాఖ మీద ప్రేముంటే..
విశాఖపట్నం: ఎన్నికలకు ముందు బాక్సైట్ తవ్వకాలపై నిరసన గళం వినిపించిన చంద్రబాబు.. ఇప్పుడు గిరిజన సంపదను తవ్వి ఎత్తుకుపోతామని చెబుతుండటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. అఖిలపక్షం పిలుపుమేరకు విశాఖ మన్యంలోని 13 మండలాల్లో శనివారం బంద్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమర్ నాథ్ మాట్లాడారు. 'లక్షల కోట్ల విలువైన గిరిజన సంపదను ఎవరికి ధారాదత్తం చేస్తున్నారో చెప్పాలి... మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ అంటే ప్రేముంటే వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి జీవో నంబర్ 97ను రద్దు చేయించాలి' అని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాల జీవో(నంబర్ 97)ను రద్దు చేసేవరకు గిరిజనుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాడుతుందని గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు.