ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వంర్యంలో చింతపల్లిలో ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విలువైన భూములను ప్రభుత్వం తమ అనుచరులకు అప్పనంగా కట్టబెడుతుందని బొత్స ఆరోపించారు.