⇒ తవ్వకాల ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఆందోళనలు
⇒ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మలు అంతటా దహనం
⇒ తాడోపేడో తేల్చుకుంటామంటున్న సీపీఎం, గిరిజన సంఘాలు
పాడేరు/చింతపల్లి: బాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యంలో మంటలు రేగుతున్నాయి. దీని తవ్వకాలకు ప్రయత్నాలు ముమ్మరం చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం, గిరిజన సంఘం నేతలు శనివారం పాడేరు, చింతపల్లి, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. డివిజన్ కేంద్రమైన పాడేరులో సీపీఎం, గిరిజన సంఘం నాయకులంతా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేశారు. సీఎం చంద్రబాబు నాయుడును గిరిజన ద్రోహిగా పేర్కొంటూ ఆ యన దిష్టిబొమ్మను దహనం చేశారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రాణాలనైనా అర్పిస్తామంటూ సీపీఎం, గిరిజన సంఘం నాయకులు పాలికి లక్కు, ఎంఎం శ్రీను, సుందరరావు, వై.మంగమ్మలు ప్రకటించారు.
చింతపల్లిలోనూ బాక్సైట్‌కు వ్యతిరేకంగా సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. ర్యాలీ అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. మెయిన్‌రోడ్డు వద్ద కొంతసేపు రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం నేత బోనంగి చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఏజెన్సీలోని నేతలంతా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాల న్నారు. సీపీఎం నాయకులు గోపీనాయని తిరుపతి, శాంతి పాల్గొన్నారు.
ముంచంగిపుట్టులో
ముంచంగిపుట్టు: బాక్సైట్‌కు వ్యతిరేకంగా సీపీఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. సీపీఎం నాయకులు కె.త్రినాథ్, పి.శాస్త్రిబాబు, పి.సత్యనారయణలు మాట్లాడుతూ తవ్వకాలతో ఏజెన్సీ వాతావారణం, పంటలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో బాక్సైట్ ను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే బహుళజాతి కంపెనీలతో బేరసారాలు చేయడం దారుణమన్నారు.
బాక్సైట్ భగభగలు
Published Sun, Nov 30 2014 12:44 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement
Advertisement