బాక్సైట్ గభగలు
- మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజనులు
- గిరిజన సంఘాల ఆందోళన, రాస్తారోకో
- ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
- అధినేత వైఖరితో టీడీపీలోనూ అంతర్మథనం
మన్యంలో బాక్సైట్ వివాదానికి మరోసారి తెరలేపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపై గిరిజనులు భగ్గుమంటున్నారు. విశాఖ ఏజెన్సీలో ఉన్న అపారమైన ఈ ఖనిజాన్ని ఐటీ డీఏ ఆధ్వర్యంలో వెలికితీయడానికి అనుమతిస్తున్నట్టు శనివారం గిరిజన సదస్సులో ఆయన ప్రకటించడంపై అడవిబిడ్డలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపద జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఏజెన్సీవ్యాప్తంగా మరో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమానికి గిరిజనులు సిద్ధమవుతున్నారు.
పాడేరు: బాక్సైట్‌ను అక్రమంగా తవ్వి గిరిజనుల ఉనికినే ప్రశ్నార్థకం చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారంటూ ఏజెన్సీలో అన్ని వర్గాల గిరిజనులు విమర్శిస్తున్నారు. గిరిజన చట్టాలు, హక్కులను నిర్వీర్యం చేసి అటవీ సంపదను దోచుకోవడానికి టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు మళ్లీ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నా రు. ఇందుకోసం వివిధ రాజకీయ పక్షాలు, గిరి జన సంఘాల నాయకులు సన్నద్ధమవుతున్నా రు.
బాక్సైట్ జోలికి వస్తే ప్రాణాలైనా ఒడ్డి గిరి జ నుల సంపదను కాపాడుతామని ఇప్పటికే వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు హెచ్చరించారు. మరోవైపున బాబు వైఖరితో స్థానిక టీడీపీ నేతలు కూడా సతమతమవుతున్నారు. పదేళ్లుగా బాక్సైట్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి బాక్సైట్‌ను తవ్వి అభివృద్ధి చేస్తానని ప్రక టించడాన్ని ఆ పార్టీ నేతలే ఖండిస్తున్నారు.
ఏజెన్సీలో టీడీపీ ఇప్పటికే మనుగడ కోల్పోయింది. సర్పంచ్, స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గిరిజనులు తిరస్కరించారు. వారి విశ్వాసాన్ని చూరగొనాల్సిందిపోయి ‘దేశం’ ప్రభుత్వాధినేత గిరిజనుల సంపదనే దోచుకునే విధంగా ప్రకటించడం మన్యం లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ గిరిజ న సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లో సురేం ద్ర ఆధ్వరంయలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించి, వైఎస్సార్ జంక్షన్‌లో సీఎం చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.
మండల కేంద్రం డుం బ్రిగుడలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. పెదబయలులో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాక్సైట్ జోలికొస్తే తరిమి కొడతామంటూ హెచ్చరించారు. ముంచంగిపుట్టులో వైఎస్సార్ సీపీ నాయకుడు పాంగి పాండురంగస్వామి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి.
గిరిజన సంఘం ఆందోళన
ఏజెన్సీలోని బాక్సైట్ జోలికి వస్తే ఖబడ్దా ర్ అంటూ గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదివారం పాడేరులో ఆం దోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందు గా పాడేరు వీధుల్లో ర్యాలీ నిర్వహించి బాక్సైట్ తవ్వకాల యోచనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐటీడీఏ ఎదు ట రాస్తారోకో చేపట్టి సీఎం చంద్రబాబు వైఖరిని దుయ్యబట్టారు. బాబును గిరిజ న ద్రోహిగా పేర్కొంటూ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అవహేళన చేశారని విమర్శించారు.
పీసా చట్టం ప్రకారం మైనిం గ్‌కు గ్రామ సభల అనుమతి తప్పనిసరి అయినా సీఎం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, బడాబాబులకు గిరిజన సంపదను దోచి పెట్టేందుకు పూనుకుంటున్నారని మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమాన్ని ఏజెన్సీవ్యాప్తంగా ఉధృతం చేస్తామని, అన్ని రా జకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో ఐక్యపోరాటం చేస్తామని చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.అప్పారావు, సీఐటీయూ నేత ఎల్.సుందరరావు, గిరిజన సంఘం నాయకులు రాందాసు, విశ్వనాథం పాల్గొన్నారు.
టీడీపీ ఆలోచన దుర్మార్గం
బాక్సైట్ తవ్వకాలు చేపడతామని సీఎం ప్రకటించడం అత్యంత దుర్మార్గమని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఏజెన్సీ అంతటా మహోద్యమం చేపడతామన్నారు. గిరిజనాభివృద్ధిని బాక్సైట్‌తో ముడిపెట్టడం టీడీపీ ద్వంద్వ పాలనకు నిదర్శనమన్నారు. గిరిజనులంతా వైఎస్సార్‌సీపీ పక్షాన ఉన్నారనే అక్కసుతోనే చర ద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిని ప్రతి గిరిజనుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అన్ని రాజకీయ పక్షాలు, గిరిజన ఉద్యోగ, విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమం చేస్తుందన్నారు. అవసరమైతే ప్రాణాలను పణంగా పెట్టి ఢిల్లీస్థాయిలో బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని చేపడతానని స్పష్టం చేశారు.
- సర్వేశ్వరరావు, అరకు ఎమ్మెల్యే