దళితులు, గిరిజనుల అభివృద్ధికి కృషి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ
విజయవాడ : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిఉన్న దళితులు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన కారెం శివాజీ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి కమిషన్ చైర్మన్‌గా తనను నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తదితర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు వారి సంక్షేమానికే ఖర్చు చేసేలాగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి కృషి చేస్తానని శివాజీ చెప్పారు. గ్రామాల్లో పర్యటించి దళితవాడల్లో మౌలిక వసతుల కల్పినకు కృషి చేస్తానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు అబివృద్ధికి ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పారు.
రేపు ప్రమాణ స్వీకారం
స్థానిక బిషప్ అజరయ్య స్కూల్‌లో తాను కమిషన్ చైర్మన్‌గా ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేస్తానని కారెం తెలిపారు. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారని వివరించారు. విలేకరుల సమావేశానికి ముందు పలు ప్రాంతాల నుంచి వచ్చిన దళిత సంఘాల నాయకులు శివాజీని అభినందించారు.