Ravela kishorbabu
-
చంద్రబాబు కరుణ కోసం..
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడంలో, స్వామిభక్తిని ప్రదర్శించడంలో మిగతా మంత్రులందర్నీ రావెల కిశోర్‌బాబు మించిపోయారు. రాష్ట్ర స్థాయి సంక్రాంతి వేడుకలను ఇందుకు వేదిక చేసుకున్నారు. శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు నాలుగు చరణాలతో కూడిన ఓ పాట రాసి ఓ బాలికతో పాడించారు. ఈ పాటలో చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. పాట విన్న ముఖ్యమంత్రి తనలో తాను మురిసిపోయారు. పాటను ఫ్రేమ్ కట్టించి సీఎంకు మంత్రి రావెల అందించారు. ఈ తతంగం చూసిన మిగిలిన మంత్రులు విస్తుపోయారు. -
బాధ్యతలు స్వీకరించిన రావెల కిశోర్‌బాబు
అనంతపురం సిటీ : తాత్కాలిక జిల్లా ఉప వైద్యాధికారిగా ఉన్న రావెల కిశోర్‌బాబుకు లెప్రసీ అండ్ ఎయిడ్స్ కంట్రోల్ విభాగపు అధిపతిగా బాధత్యలను అప్పగిస్తూ జిల్లా వైద్యాధికారి వెంకటరమణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. లెప్రసీ అండ్ ఎయిడ్స్ కంట్రోల్ అదనపు జిల్లా వైద్యాధికారి సాయి ప్రతాప్ బుధవారం పదవీ విమరణ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో టీబీ కంట్రోల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రావెల కిశోర్‌బాబు తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనమాట్లాడుతూ ఈ విభాగంలో తనకు చాలా అనుభవం ఉందన్నారు. సమన్వయంతో ఎయిడ్స్ నియంత్రకు తమ వంతు కషి చేస్తామన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిశారు. -
మంత్రి రావెలను ఆంధ్రాలో తిరగనివ్వం
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావు గుంటూరు వెస్ట్ : రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబును ఆంధ్రాలోని 13 జిల్లాల్లో ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావు మాదిగ తెలిపారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ సహకారంతోనే కిశోర్‌బాబు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం వెనుక ఎమ్మార్పీఎస్ సహకారం ఉందన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. భూకబ్జాదారులు, దళారులను ప్రోత్సహిస్తున్న మంత్రి రావెల నేడు కృష్ణమాదిగను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏటుకూరి విజయ్‌కుమార్, నాయకులు వర్ల అగస్టీన్, కూచిపూడి సుందర్‌బాబు, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గాలిముట్టి కిరణ్ పాల్గొన్నారు. -
'గిరిజన ద్రోహి మంత్రి రావెల'
పాడేరు(విశాఖపట్నం): ఏపీ సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గిరిజన ద్రోహి అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర రావులు విమర్శించారు. ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయకపోవడంతో వారు నిరసన తెలిపారు. పాడేరులో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.