ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావు
గుంటూరు వెస్ట్ : రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబును ఆంధ్రాలోని 13 జిల్లాల్లో ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావు మాదిగ తెలిపారు. బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ సహకారంతోనే కిశోర్‌బాబు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం వెనుక ఎమ్మార్పీఎస్ సహకారం ఉందన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
భూకబ్జాదారులు, దళారులను ప్రోత్సహిస్తున్న మంత్రి రావెల నేడు కృష్ణమాదిగను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏటుకూరి విజయ్‌కుమార్, నాయకులు వర్ల అగస్టీన్, కూచిపూడి సుందర్‌బాబు, వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు గాలిముట్టి కిరణ్ పాల్గొన్నారు.
మంత్రి రావెలను ఆంధ్రాలో తిరగనివ్వం
Published Mon, Mar 14 2016 4:27 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM
Advertisement
Advertisement