
అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై మంత్రి రావెల కిశోర్ బాబు చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
మంత్రి రావెల క్షమాపణ చెప్పాల్సిందేనని నాయకులు పట్టుబట్టారు. అయితే, ఈ అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంగీకరించలేదు. దాంతో సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.