పాడేరు: గిరిజనుల గొంతుకోసే బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుందామంటూ అఖిలపక్షం నాయకులు పాడేరులో శనివారం ర్యాలీ తీశారు. ప్రభుత్వం వెంటనే జీవో 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పాల్గొన్నాయి.
అంతేకాకుండా అనంతగిరి మండలకేంద్రంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద అఖిలపక్షం నాయకులు ధర్నా చేశారు. ఉత్తరాంధ్రలోబాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆందోళన చేశారు. ధర్నాలో పాల్గొన్న అఖిలపక్షనాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.