
ఆదివాసీల హక్కుల కోసం రాహుల్ పాదయాత్ర
ఢిల్లీ: ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ...మే నెలలో పాడేరు, చింతపల్లిలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని అన్నారు.
ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. విశాఖ మన్యంలో బాక్సైజ్ తవ్వకాల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకడుగు విషయం తెలిసిందే.