విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులను వెంటనే రద్దు చేయాలని గిరి జన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
గిరిజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులను వెంటనే రద్దు చేయాలని గిరి జన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ నాయకులు గిరిజన ‘ప్రజలను మభ్యపెట్టారని ధ్వజమెత్తింది. కార్పొరేట్ ప్రయోజనాల కోసం గిరిజనుల భూములను లాక్కోవడం అన్యాయమని సంఘ నేతలు శోభ న్‌నాయక్, ధర్మనాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు ఇవ్వడం దారుణమని విమర్శించారు. ఈ తవ్వకాలకు అనుమతులు వెంటనే రద్దు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.