ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు బీజంవేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు వేరొకరిపై నిందలు వేయడం
చింతపల్లి: ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు బీజంవేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు వేరొకరిపై నిందలు వేయడం తగదని, సీపీఐ రాష్ట్రసహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లడుతూ 1999లోఅధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు తెరలేపారన్నారు. అనంతరం ఆయన అధికారం కోల్పోవడం వల్లే ఇంతకాలం బాక్సైట్ తవ్వకాలు ఆగాయని, కాంగ్రెస్ హాయాంలో అనుమతులు మంజూరైనా, ప్రజా వ్యతిరేకత దృష్ట్యా తవ్వకాలు నిలిపి వేశారని వివరించారు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే మళ్లీ బాక్సైట్ అంశం తెరమీదకు తెచ్చి, తాను చేస్తున్న తప్పును వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేయడం తగదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి రాగానే మరోలా వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ జిల్లాసహాయ కార్యదర్శి బడుగు రామరాజ్యం,సత్యనారాయణ,పెద్దబ్బాయి పాల్గొన్నారు.