
పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే
విజయనగరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర తీవ్రంగా మండిపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాక్సైట్ తవ్వకాలకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని సాలూరు నియోజవర్గ ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమంటూ మండిపడ్డారు.
బాక్సైట్ తవ్వకాలపై చర్చించడానికి ఈ ఆదివారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమావేశం అవుతామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారంటూ పవన్ కల్యాణ్ ఇటీవలే వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.