బెజవాడలో సీఎం దిష్టిబొమ్మ దహనం
Published Wed, Nov 25 2015 11:53 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM
గాంధీనగర్: బాక్సైట్ తవ్వకాలకు అనుమతించే జీవోను రద్దు చేయాలంటూ విజయవాడలో న్యూడెమోక్రసీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. బుధవారం ఉదయం స్థానిక లెనిన్ సెంటర్‌లో సీపీఐ ఎల్ న్యూమోక్రసీ నేత చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. గిరిజనుల జీవితాలను ఛిద్రం చేసే బాక్సైట్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement