'బాబుకు ఓటేసిన ఫలితం అనుభవిస్తున్నారు..' | CPI leader criticized Chandra babu Naidu for bauxite mining | Sakshi
Sakshi News home page

'బాబుకు ఓటేసిన ఫలితం అనుభవిస్తున్నారు..'

Published Thu, Nov 12 2015 3:53 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

CPI leader criticized Chandra babu Naidu for bauxite mining

చంద్రబాబుకు ఓటేసిన ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కృష్ణమూర్తి అన్నారు. ఆయన గురువారం విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పాలెపువలస, వల్లాపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. బాక్సైట్ తవ్వకాలతో ప్రభావితమయ్యే ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు.

బాక్సైట్ మైనింగ్ కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు, టీడీపీకి ఓటేసిన పాపం ప్రజలను వెంటాడుతోందని చెప్పారు. గనుల పేరుతో సీఎం చంద్రబాబు ప్రజల పొట్టకొడుతున్నారని విమర్శించారు.  ప్రజల జీవనాధారమైన కొండలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. వెంటనే బాక్సైట్ మైనింగ్ ఆపేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement