అధిక ప్రచారంలో చంద్రుల పోటీ:తమ్మినేని | Tammineni comment on two states CMs | Sakshi
Sakshi News home page

అధిక ప్రచారంలో చంద్రుల పోటీ:తమ్మినేని

Published Wed, Mar 16 2016 4:10 AM | Last Updated on Sat, Aug 18 2018 6:05 PM

అధిక ప్రచారంలో చంద్రుల పోటీ:తమ్మినేని - Sakshi

అధిక ప్రచారంలో చంద్రుల పోటీ:తమ్మినేని

సాక్షి, హైదరాబాద్: అవాస్తవిక ఆలోచనలతో ముందుకు సాగడంలో, ఉన్నదాని కంటే ఎక్కువ ప్రచారం చేసుకోవడంలో ఇద్దరు చంద్రులు పోటీపడుతున్నారని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబులను ఉద్దేశించి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. మంగళవారం జరిగిన సీపీఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సమావేశంలో పార్టీ నాయకురాలు జ్యోతితో కలసి మాట్లాడుతూ.. ఆపరేషన్ ఆకర్ష్ కోసమే కేసీఆర్ సొంత పద్దు కింద బడ్జెట్‌లో రూ.4,600 కోట్లు కేటాయించుకున్నారని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల వారి సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరపలేదని పేర్కొన్నారు. నీటిపారుదల రంగానికి రూ.25 వేల కోట్లు కే టాయించడాన్ని ఆహ్వానిస్తున్నా.. వెనుకబడ్డ జిల్లాల్లోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుపడుతున్నట్లు చెప్పారు. తుది కసరత్తులో బడ్జెట్‌కు మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. టీడీపీ మైనస్ అయ్యిందని, కాంగ్రెస్ చేష్టలుడిగి చూస్తోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement