ఎన్ని లక్షల గొంతులు తమకు బాక్సైట్ తవ్వకాలు వద్దంటున్నా.. చంద్రబాబుకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు