
అవుట్‌పోస్టులపై కన్నెర్ర
విశాఖమన్యం లో ప్రజాప్రతినిధులకు మావోయిస్టుల నుంచి మరోసారి ముప్పు ఎదురవుతోంది. ఇన్నాళ్లూ బాక్సైట్ తవ్వకాలపై మండిపడుతున్న...
- మరోసారి మావోయిస్టుల మండిపాటు
- మన్యం ప్రజాప్రతినిధులకు మళ్లీ తప్పని దాడుల బెడద
చింతపల్లి, న్యూస్‌లైన్ : విశాఖమన్యం లో ప్రజాప్రతినిధులకు మావోయిస్టుల నుంచి మరోసారి ముప్పు ఎదురవుతోంది. ఇన్నాళ్లూ బాక్సైట్ తవ్వకాలపై మండిపడుతున్న మావోయిస్టులు ఇప్పుడు అవుట్‌పోస్టుల ఏర్పాటుపై ఆగ్రహోదగ్రులవుతున్నారు. స ర్పంచ్‌లను నిర్బంధిస్తున్నారు. గతం లో మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని హెచ్చరి స్తూ ప్రజాప్రతినిధులపై దాడులకు ది గిన మావోయిస్టులు తాజాగా పోలీసు అవుట్‌పోస్టుల ఏర్పాటును అడ్డుకోవాలని హెచ్చరిస్తున్నారు.
గురువారం జి.కె.వీధి మండలం దేవరాపల్లి సర్పంచ్ సిరిబాల బుజ్జిబాబును, మరో ఇద్దరు సర్పంచ్‌లను అపహరించిన మావోయిస్టులు ఏజెన్సీలో కూంబింగ్‌ను, పోలీసు అవుట్‌పోస్టుల ఏర్పాటును అడ్డుకునేందుకు పోరాడాలని హెచ్చరించి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్యం లోని ప్రజాప్రతినిధుల గుండెల్లో మ రోసారి గుబులు చోటుచేసుకుంది. బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాడుతు న్న మావోయిస్టులు గతంలో జిల్లాపరి షత్ ఉపాధ్యక్షుడు ఉగ్గరంగి సోమలిం గాన్ని, సమిడి రవిశంకర్‌ను, జి.కె.వీధి మండల ఉపాధ్యక్షుడు సోమలింగా న్ని హతమార్చారు.
బాక్సైట్‌కు వ్యతి రేకంగా ఉద్యమాలు చేయకపోతే ప్ర జాప్రతినిధులందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ఏజెన్సీ నా యకులంతా రాజీనామాలు చేయాల ని అల్టిమేటం జారీచేయడంతో మ న్యం లో చాలామంది నేతలు పార్టీల కు, పదవులకు గుడ్‌బై చెప్పారు. బా క్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు ని ర్వహించారు. క్రమంగా బాక్సైట్ వ్య వహారం చల్లబడుతోందని ఊపిరి పీ ల్చుకుంటున్న మన్యం నేతలకు మరో సమస్య ఎదురైంది. ఏజెన్సీలోని పలు గ్రామాల్లో పోలీసు అవుట్‌పోస్టులు ఏ ర్పాటుచేసేందుకు ప్రభుత్వం చర్య లు చేపట్టింది.
ఈ పరిణామాలపై భ గ్గుమంటున్న మావోయిస్టులు మరోసారి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవ ల పెదవలసలో కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థి భర్త లక్ష్మీపడాల్‌కు దేహశుద్ధి చేశారు. పెదవలసలో పోలీ సు అవుట్‌పోస్టును ఏర్పాటుచేస్తే స హించేదిలేదని హెచ్చరించారు. తాజా గా ముగ్గురు సర్పంచ్‌ల కిడ్నాప్‌తో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా కలవరపడుతున్నారు.