పాడేరు: బాక్సైట్ తవ్వకాల అంశంపై విశాఖ జిల్లా బీజేపీ నేతలు పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. బాక్సైట్ అంశంపై పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీకి రాజీనామా చేస్తామన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన బీజేపీ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పాడేరు నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ కురుస ఉమామహేశ్వరరావు, అరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎస్.వేమనబాబు, అన్ని మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
బాక్సైట్ పై బీజేపీకి నేతల అల్టిమేటం
Published Fri, Nov 13 2015 2:21 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
Advertisement
Advertisement