బాక్సైట్ తవ్వకాలకు మద్దతిచ్చిన వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు చేసిన హెచ్చరికలు విశాఖ జిల్లాలో కలకలం రేపాయి.
గూడెం కొత్తవీధి (విశాఖపట్నం) : బాక్సైట్ తవ్వకాలకు మద్దతిచ్చిన వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు చేసిన హెచ్చరికలు విశాఖ జిల్లాలో కలకలం రేపాయి. ఈ మేరకు కోరుకొండ ఏరియా కమిటీ పేరుతో గురువారం పత్రికా ప్రతినిధులకు లేఖలు అందాయి.
బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పనిచేస్తున్న పునరావాస కమిటీ సభ్యులు వారంలోగా ప్రజాకోర్టులో లొంగిపోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. లేకుంటే వారి కుటుంబసభ్యులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కాగా దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.