'వైఎస్ జగన్ పర్యటనకు భయపడే'
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాక్సైట్ తవ్వకాల జీవోను శాశ్వతంగా రద్దు చేసేవరకు వైఎస్సార్సీపీ ఉద్యమం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆమె మంగళవారమిక్కడ మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చింతపల్లి పర్యటనకు భయపడే జీవోను చంద్రబాబు తాత్కాలికంగా నిలిపివేశారని ఎద్దేవా చేశారు. జీవో రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని, గిరిజనులకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని ఈశ్వరి తెలిపారు.