
రేపు చింతపల్లిలో వైఎస్ జగన్ సభ
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతంలో పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 8 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్తున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో నర్సీపట్నం మీదుగా చింతపల్లి చేరుకుని, అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.