విశాఖపట్నం: విశాఖ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లపై అనకాపల్లిలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ విశాఖ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. విశాఖ మేయర్ పీఠమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...విజయవాడ కల్తీమద్యం మరణాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిపక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు.