ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి : కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టే దీక్ష మోసపూరితమైందని ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో ఏడేళ్లు, ఇప్పుడు నాలుగేళ్ల పాటు బీజేపీతో పొత్తుపెట్టుకుని రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చనందకు నిరాహార దీక్ష చేస్తున్నారా?, లేకపోతే నిరుద్యోగలందరికి ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు దీక్ష చేస్తున్నారా? డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పూర్తిగా రుణాలను మాఫీ చేయనందుకు దీక్ష చేపడుతున్నారా? రైతన్నలను మోసగించినందుకు నిరాహారదీక్ష చేస్తున్నారా? అన్న ప్రశ్నలన్నింటికీ ముందుగా సమాధానాలు చెప్పి నిరాహార దీక్షకు పూనుకోవాలన్నారు. ఒక్క రోజు ఐదు గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్ష చేయడానికి 50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడంతోనే వీళ్ల చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు.
పార్లమెంటులో అవిశ్వాసం పెడితే ఏమొస్తుంది, రాజీనామాలు చేస్తే ఏం లాభం అన్న ఆయన ఒక్క రోజు దీక్షకు ఎందుకు పూనుకొన్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేతనని చెప్పుకునే ఆయన ఆ రోజు ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విషయంలో నేను మోదీకి సలహా ఇచ్చానని గొప్పగా చెప్పుకున్నారన్నారు. ఆ నోట్ల రద్దు వలన ప్రజలు, వ్యాపారస్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కబడటం లేదా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment