'బాక్సైట్ తవ్వకాలపై ఉద్యమిస్తాం' | Protest against bauxite mining orders | Sakshi
Sakshi News home page

'బాక్సైట్ తవ్వకాలపై ఉద్యమిస్తాం'

Published Thu, Nov 5 2015 5:53 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM

Protest against bauxite mining orders

విశాఖపట్టణం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

బాక్సైట్ తవ్వకాలను జరగనిచ్చే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. అఖిల పక్షం, గిరిజన సంఘాలతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టయినా తవ్వకాలు అడ్డుకుంటామని తెలిపారు. టీడీపీ నేతలను కిడ్నాప్ చేసినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకమని..అధికారంలోకి రాగానే ఏవిధంగా అనుమతులిస్తారని ప్రశ్నించారు.   


బాక్సైట్ మైనింగ్ అనుమతుల జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. గిరిజన పోరాటాలు, హక్కులను కాలరాస్తూ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. రూ. కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారన్నారు. ప్రతిపక్షనేతగా తవ్వకాలకు వ్యతిరేకంగా గవర్నర్కు లేఖ రాసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మాట మార్చారని అమర్నాథ్ అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement