వైఎస్సార్ సీపీ నాయకులు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదనరెడ్డి అరెస్టుకు నిరసనగా జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షం పట్ల అధికార పార్టీ నాయకుల తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ, ప్రజా సంఘాల నాయకులు మంగళవారం వివిధ రూపాల్లో నిరసన తెలియజేశారు.
తప్పుడు కేసులకు భయపడం
యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు స్పష్టం చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళవారం ఎస్వీయూలోని అంబే డ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని పూజలు
యూనివర్సిటీ క్యాంపస్: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరి కాయలు కొట్టి, పూజలు చేయించారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయం గా ఎదుర్కోలేకే అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు.
చంద్రగిరిలో ఒంటికాలిపై నిలబడి నిరసన
చంద్రగిరి : ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చంద్రగిరిలో మంగళవారం వైఎస్సార్ సీపీ నాయకులు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ చంద్రగిరి మండల కన్వీనర్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, చిల్లకూరి యుగంధర్‌రెడ్డి ఆధ్వర్యలంలో టవర్ క్లాక్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆగని ఆందోళనలు
Published Wed, Jan 20 2016 2:24 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement