రాష్ట్ర విభజనకు నిరసనగా ఢిల్లీలో ‘సమైక్య వాక్’ చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం తగదని పలు సంఘాల నేత ఖండించారు. కేంద్ర ప్రభుత్వం అక్రమ అరెస్టుల ద్వారా ‘సమైక్య’ ఉద్యమాన్ని ఆపలేదని స్పష్టం చేశారు. అణచివేయాలని చూస్తే ఉద్యమం ఉప్పెనలా ఎగిసిపడుతుందని హెచ్చరించారు. - న్యూస్‌లైన్, అనంతపురం టౌన్
పక్షపాత ధోరణికి నిదర్శనం
సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం కిరణ్, ఎన్‌జీఓ నేత అశోక్‌బాబు కూడా దీక్ష చేపట్టారు. వారెవర్నీ అరెస్ట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాత్రమే అరెస్టు చేయించడం పక్షపాత ధోరణికి నిదర్శనం. దీన్ని సమైక్యవాదులంతా ఖండించాలి.
- రమణారెడ్డి, జాక్టో కన్వీనర్
నిరసన తెలపడం తప్పా?
సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని కేంద్రం గుర్తించుకోవాలి. ఒక పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అయిన జగన్‌మోహన్‌రెడ్డి నిరసన వ్యక్తం చేయడం తప్పా? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకా నియంతృత్వమా? అరెస్ట్‌లు చేసి రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. - నరసింహులు, విద్యా జేఏసీ కన్వీనర్
హేయమైన చర్య
జగన్‌ను అరెస్ట్ హేయమైన చర్య. ఈ రోజు జగన్ అరెస్ట్, మొన్న ఎంపీల బహిష్కరణను చూస్తే కేంద్రం కావాలనే సీ మాంధ్ర ప్రజాప్రతినిధుల పట్ల ఇ లాంటి ధోరణిని అవలంబిస్తోంది. రాష్ర్టం బచావో అంటూ వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేస్తోంటే.. కాంగ్రెస్ బచావో అంటూ సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హైదరాబాద్ సమావేశాలు నిర్వహించడం విడ్డూరం. - రమేష్‌బాబు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
అక్రమ అరెస్ట్‌తో ఉద్యమాన్ని ఆపలేరు
వైఎస్ జగన్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమ అరెస్ట్‌లతో సమైక్య వాదాన్ని అణచాలని చూస్తే అంతకు రెట్టింపు స్థాయిలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది. కేంద్రం ఇప్పటికైనా ప్రజా ఉద్యమానికి తలొగ్గి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేయాలి. లేదంటే ఢిల్లీ వీధులు దద్దరిల్లేలా మరిన్ని ఆందోళనలు చేపడతాం. - ఫరూక్‌అహమ్మద్,
ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి
ఖండిస్తున్నాం..
వైఎస్ జగన్ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడం అభినందనీయం. ఆయ న్ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నాం. తెలు గు ప్రజల మధ్య చిచ్చు పెట్టిన కాంగ్రెస్‌ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం. సమైక్యాంధ్ర కోసం పనిచేస్తున్న ఏ పార్టీకైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. - సంపత్‌కుమార్, విద్యుత్ జేఏసీ చైర్మన్
అరెస్టు తగదు
ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా నిరసన తెలియజేసే హక్కు ను రాజ్యాంగం కల్పిం చింది. ఢిల్లీలో సమైక్యవాణి విన్పిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం తగదు. ఈ అరెస్టును ప్రజాస్వామ్య వాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. - రాచంరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీఆర్‌జేఏసీ చైర్మన్
జగన్ అరెస్ట్ దారుణం
వైఎస్ జగన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం దారుణం. కేంద్ర ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేదు. ఉద్యమాన్ని పెద్దఎత్తున ముందుకు తీసుకెళుతున్న జగన్... కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలో చేపట్టిన దీక్షను భగ్నం చేయడం హేయమైన చర్చ. యూపీఏ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, బెదిరింపులకు దిగినా ఉద్యమాన్ని అడ్డుకోలేదు. - దేవరాజు, ఏపీఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు
జగన్ అరెస్ట్ అక్రమం
Published Tue, Feb 18 2014 3:11 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement