బాక్సైట్ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలంటూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
పాడేరు రూరల్: బాక్సైట్ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలంటూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖ మన్యంలో నిక్షిప్తమైన బాక్సైట్‌ను వెలికితీయవద్దని ఆందోళన చేస్తున్న గిరిజన నాయకులపై పెట్టిన అక్రమ అరెస్ట్‌లను నిలుపుదల చేయాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. అలాగే జీఓ నెం.97 రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పల నర్సయ్యతో పాటు పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు.