సాక్షి, అమరావతి : గిరిజనులకు వైద్య సేవలదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో గిరిజన మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాడేరు ఏరియా ఆస్పత్రిలోనే గిరిజన మెడికల్ కాలేజ్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కాలేజీగా నామకరణం చేసింది. గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించడం కోసం ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment