పులివెందుల, పాడేరు మెడికల్‌ కాలేజీలకు అనుమతులు | Permissions for Pulivendula and Paderu Medical Colleges: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పులివెందుల, పాడేరు మెడికల్‌ కాలేజీలకు అనుమతులు

Published Tue, Sep 10 2024 4:56 AM | Last Updated on Tue, Sep 10 2024 4:56 AM

Permissions for Pulivendula and Paderu Medical Colleges: Andhra pradesh

రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డినా చెరో 50 ఎంబీబీఎస్‌ సీట్లకు అడ్మిషన్లు

నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ లైన్‌క్లియర్‌

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో కొత్త వైద్య కళాశాలకు అనుమతులు రాకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డినప్పటికీ అనుమతులు రాక మానలేదు. 2024–25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్‌ సీట్లతో అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. దీంతోపాటు పాడేరు వైద్య కళాశాలకు కూడా 50 సీట్లను మంజూరు చేశారు. వాస్తవానికి ఈ రెండు కళాశాలలతో పాటు, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 సీట్లతో తరగతులు ప్రారంభించాలని గత ప్రభుత్వంలోనే చర్యలు ప్రారంభించారు.

అయితే, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబు ప్రభుత్వం కావాలని అనుమతులు రాబట్టేలా చర్యలు తీసుకోలేదు. దీంతో తొలివిడత తనిఖీల అనంతరం ఐదుచోట్ల కొంతమేర వసతుల కొరత ఉన్నాయని ఎన్‌ఎంసీ అనుమతులు నిరాకరించింది. తొలివిడత తనిఖీల్లో తీసుకున్న నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో అధికారులకు అనుమతులిచ్చిప్పటికీ వసతుల కల్పన మాత్రం చేపట్టలేదు.

దీంతో గత ప్రభుత్వంలో కల్పించిన వసతుల ఆ«ధారంగా వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌ అనంతరం ప్రభుత్వం అండర్‌ టేకింగ్‌ ఇస్తే పులివెందులకు 50 సీట్లు మంజూరు చేస్తామని ఎన్‌ఎంసీ ప్రకటించింది. అయినప్పటికీ ప్రభుత్వం అండర్‌టేకింగ్‌ ఇవ్వ­లేదు. అండర్‌టేకింగ్‌ ఇవ్వకపోయినప్పటికీ ఎన్‌ఎంసీ అనుమతులు మంజూరుచేయడంతో వైద్యశాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement