ఏపీలో బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇప్పటికీ మారనట్లుగా కనిపిస్తోంది. బాక్సైట్ అంశంపై ఏపీ శాసనసభలో మంత్రి పీతల సుజాత ప్రకటన ఇచ్చినప్పటికీ, జీవో నంబర్ 97ను రద్దు చేస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. దీనర్థం బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గేది లేదని ఏపీ ప్రభుత్వం సంకేతాలు పంపిస్తున్నట్లు చెప్పవచ్చు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టరాదంటూ విశాఖ జిల్లాలో తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.