GO no.97
-
వెటర్నరీ విద్యార్థులకు వైఎస్ జగన్ మద్దతు
విజయవాడ: పశు వైద్య కేంద్రాలను పశువైద్యశాలలుగా మార్చాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. శుక్రవారం గుంటూరు జిల్లా పర్యటనలో వెళుతున్న ఆయన వెటర్నరీ కళాశాల వద్ద విద్యార్థుల దీక్ష శిబిరాన్ని సందర్శించారు. జీవో నెంబర్ 97లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ పశువైద్య విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం సంచార పశువైద్యం కోసం ప్రైవేటు నియామకాలు జరుపుతామని ప్రకటిస్తూ జీవో నెంబరు 97 విడుదల చేయటాన్ని వ్యతిరేకిస్తూ వారు దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రన్న సంచార పశు వైధ్యపథకంలో కాంట్రాక్ట్ పద్ధతుల్లో కాకుండా శాశ్వత పద్ధతుల్లో పశువైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధమైనవన్నారు. ఆర్ఎల్యూలను వీడీలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సంచార పశు వైద్యశాలల్లో కాంట్రాక్టు నియామకాల్ని వ్యతిరేకిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. జీవో నెంబరు 97 రద్దు చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తామన్నారు. మున్సిపాలిటీల్లో జంతువుల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టేందుకు పశువైద్యులు క్రియాశీలక పాత్ర పోసిస్తారన్నారు. ఇన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా విద్యార్థుల ఆందోళనపై చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు హయాంలో న్యాయం జరగకుంటే వచ్చేది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమేనని, తప్పక న్యాయం చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అప్పటివరకూ విద్యార్థులకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. -
బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గని ఏపీ ప్రభుత్వం!
-
బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గని ఏపీ ప్రభుత్వం!
హైదరాబాద్: ఏపీలో బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇప్పటికీ మారనట్లుగా కనిపిస్తోంది. బాక్సైట్ అంశంపై ఏపీ శాసనసభలో మంత్రి పీతల సుజాత ప్రకటన ఇచ్చినప్పటికీ, జీవో నంబర్ 97ను రద్దు చేస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. దీనర్థం బాక్సైట్ తవ్వకాలపై వెనక్కి తగ్గేది లేదని ఏపీ ప్రభుత్వం సంకేతాలు పంపిస్తున్నట్లు చెప్పవచ్చు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టరాదంటూ విశాఖ జిల్లాలో తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా జీవో నంబర్97 అనేది విశాఖ, మన్యం ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు జరపాలని ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో. గత కొన్ని రోజులుగా వీటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, గిరిజనులతో కలిసి పోరాటం సాగిస్తున్నారు. ఇటీవల బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉధృతం కావడంతో జీఓ 97ను నిలుపుదల చేస్తామని మంత్రులు నోటిమాటతో సరిపెట్టారు, కానీ ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వక పోవడం గమనార్హం.