సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు అవాస్తవమని విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం కొత్తగా ఎవరికీ మైనింగ్ లైసెన్స్ ఇవ్వలేదని తెలిపారు. కోర్టు అనుమతితో ఇచ్చిన లైసెన్స్ మేరకు లెట్‌రైట్ తవ్వకాలు మాత్రమే జరుగుతున్నాయని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడినవారి లైసెన్స్‌లు రద్దు చేశామన్నారు. అక్రమ మైనింగ్‌పై రేపటి నుంచి అనకాపల్లి ఏరియాలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని వెల్లడించారు. 3 జిల్లాల్లో కలిపి అక్రమ మైనింగ్‌పై రూ.250 కోట్ల వరకు ఫైన్ విధించామని తెలిపారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment