![చెల్లని చెక్కు ఇచ్చారంటూ ఎంపీపై ఫిర్యాదు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51414233825_625x300.jpg.webp?itok=5Q-BwUEq)
చెల్లని చెక్కు ఇచ్చారంటూ ఎంపీపై ఫిర్యాదు
ధర్మవరం (అనంతపురం) : అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో చీటింగ్ కేసు నమోదైంది. ధర్మవరం వ్యాపారి అంబటి మల్లికార్జునకు ఎంపీ రూ. 5 లక్షలు బాకీపడ్డారు. అయితే, చెల్లని చెక్కులు ఇచ్చారంటూ ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. మల్లికార్జున ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.