
అరకు ఎంపీ కొత్తపల్లి గీత
సాక్షి, ఢిల్లీ: కేంద్రాన్ని ఏం అడగాలో టీడీపీకే క్లారిటీ లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల విషయంలో స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా అందరం రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఎంత నిధులు వచ్చాయో కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా రాష్ట్రం కోసం పోరాడాలని, ప్రజల్ని నష్టపరచకుండా నాయకులు వ్యవహరించాలని సూచించారు.
రైల్వేజోన్ విశాఖకు రావాలని, అది విశాఖ ప్రజల హక్కు అని వ్యాఖ్యానించారు. విజయవాడకు ఎయిమ్స్ రావడం వల్ల ఉత్తరాంధ్రకు నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అన్ని సంస్థలు విజయవాడ, అమరావతికే వెళ్తున్నాయని, ఉత్తరాంధ్రకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment