
కొత్తపల్లి గీత(ఫైల్)
విశాఖపట్నం: అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. నందివలసలో సోమవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమెను గిరిజనులు నిలదీశారు. హుదూద్ తుపాను వచ్చిన మూడు వారాల తర్వాత అరకులో కనిపించిన ఎంపీని కడిగిపారేశారు.
ఈ మూడు వారాల్లో కనీసం తమను పలకరించడానికి రాని ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను సాయం అందలేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. గిరిజనులు నిలదీయడంతో ఎంపీ అవాక్కయ్యారు.