araku MP
-
గిరిజనుల కులదైవం ఫోటోతో పాటు వైఎస్ఆర్ గారి ఫోటో..
-
వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు పెరిగాయి: రాష్ట్రపతికి అరకు ఎంపీ ఫిర్యాదు
సాక్షి,ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వైఎస్ఆర్సీపీ నేతలపై వేధింపులు ఎక్కువయ్యాయని అరకు ఎంపీ తనూజారాణి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. మంగళవారం(జులై2) ఆమె రాష్ట్రపతిని కలిశారు. 15 నిమిషాల పాటు రాష్ట్రపతితో తనూజారాణి భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని లేదంటే ప్రత్యేక చట్టం ద్వారా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్ని స్థానిక గిరిజనులకే కేటాయించాలి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అరకు కాఫీ రైతుల బాగు కోసం గిరిజన కాఫీ సొసైటీ స్థాపించాలని, ఈ సొసైటీ ద్వారా కాఫీ కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందని రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చారు. -
3 కాదు 30 పార్టీలు కలిసొచ్చిన సరే.. గెలిచేది జగనన్నే
-
MP Goddeti Madhavi: ఎంపీ అయినా రైతే!
సాక్షి, కొయ్యూరు (విశాఖపట్నం): వరి నూర్పిడి అనంతరం రాశిగా పోసిన ధాన్యాన్ని బస్తాలోకి ఎత్తుతోంది ఎవరో గమనించారా? ఇంకెవరు.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. సహజంగానే ఆమె ఎలాంటి అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా సాదాసీదాగా ఉంటారు. శరభన్నపాలెంలో శుక్రవారం వారి పొలంలో వరి నూర్పిడి చేశారు. ఆ పనుల్లో ఎంపీతో పాటు, ఆమె భర్త శివప్రసాద్‌లు పాలుపంచుకున్నారు. చదవండి: (ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే: సీఎం జగన్) -
పొలం పనుల్లో అరకు ఎంపీ మాధవి
సాక్షి, అరకు : పార్లమెంటు సభ్యురాలు అయినప్పటికీ తమ కుటుంబ జీవనాధారమైన వ్యవసాయ పనుల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొన్నారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడు ద్వారా సంక్రమించిన పొలంలో మంగళవారం దుక్కి దున్ని విత్తనాలు జల్లి పనులు చేపట్టారు. తన స్వగ్రామం శరభన్నపాలెం నుంచి నిమ్మగడ్డ వెళ్లే మార్గంలో ఉన్న పరిమిత వ్యవసాయ భూమిలో పొలం పని చేశారు. తొలి దశ నుంచి తన తండ్రి ద్వారా వ్యవసాయ పనులు చేస్తూ సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం అలవాటు అని ఎంపీ మాధవి పేర్కొన్నారు. -
సీఎం రాకతో రిసెప్షన్లో సందడి
అన్నా.. ఎలా ఉన్నారు, అమ్మా.. అంతా ఓకే కదా.. అంటూ ఆద్యంతం ఉత్సాహంగా అందరినీ పేరుపేరునా పలకరించడంతో వారంతా ఆనందంతో పులకించిపోయారు. అలా పలకరించిన నేత.. సాక్షాత్తు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కావడమే వారి ఆనందానికి కారణం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలనే కాదు.. కార్యకర్తలను కూడా ఆత్మీయంగా, ఎంతో ఆదరంగా ఒక్కొక్కరినీ పేరు పెట్టి పిలిచిన అధినేతను చూసి సంబరపడ్డారు. ఈనెల 17న వివాహం చేసుకున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, శివప్రసాద్‌లను ఆశీర్వదించేందుకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు నేరుగా ఢిల్లీ నుంచి విచ్చేశారు. ఎయిర్‌పోర్టులోనూ, వివాహ రిసెప్షన్ వేదిక వద్ద.. తనను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ సీఎం ఆత్మీయంగా పలకరించారు. కేకే రాజు ది గ్రేట్.. అంటూ ఉత్తర నియోజకవర్గ అభ్యర్ధి కేకే రాజును, గౌరమ్మా ఎలా ఉన్నావంటూ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరిని, గురువులన్నా ఎలా ఉన్నావ్.. అంటూ కోలా గురువులును.. ఇలా ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలిచి ప్రేమగా పలకరించారు. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి రాకతో అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి రిసెప్షన్ వేదిక వద్ద సందడి వాతావరణం నెలకొంది. రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు విశాఖ విమాశ్రయానికి సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్‌కు సాయంత్రం 6.43 గంటలకు చేరుకున్నారు. వధూవరులు ఎంపీ మాధవి, శివప్రసాద్‌ను ఆశీర్వదించారు. నూతన దంపతులు, వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి కాసేపు మాట్లాడారు. మాధవి, శివప్రసాద్ దంపతులు ముఖ్యమంత్రి జగన్‌కు పాదాభివందనం చేశారు. వివాహానికి హాజరైన పార్టీ శ్రేణులకు, ప్రజలకు సీఎం అభివాదం చేశారు. రిసెప్షన్‌కు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, ఎంపీలు డా.భీశెట్టి వెంకట సత్యవతి, వంగా గీత, గోరంట్ల మాధవ్, డా.సంజీవ్‌కుమార్, చంద్రశేఖర్, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు చెట్టి ఫాల్గుణ, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, పార్టీ నేతలు అక్కరమాని విజయనిర్మల, పరిక్షిత్ రాజు, కుంభా రవిబాబు, కొయ్య ప్రసాదరెడ్డి, సతీష్‌వర్మ, సుధాకర్, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి తదితరులు హాజరయ్యారు. జిల్లా సమస్యలపై సీఎంతో చర్చించిన దాడి సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు భేటీ అయ్యారు. మంగళవారం నగరానికి వచ్చిన సీఎంతో కారులో ప్రయాణిస్తూ జిల్లా సమస్యలపై మాట్లాడారు. విశాఖ నగరంలో రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒకప్పుడు పాతబస్తీకే పరిమితమైన కాలుష్యం ఇప్పుడు ఎంవీపీ కాలనీ వరకు విస్తరించిందని వివరించారు. దాని నియంత్రణపై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. దాడి చెప్పిన సమస్యలపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే కలెక్టర్ వినయ్‌చంద్‌తో మాట్లాడారు. తక్షణమే నగర కాలుష్యంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం పథకాల అమలుపై సీఎం జగన్.. దాడి వీరభద్రరావుని ఆరాతీశారు. ముఖ్యమంత్రిని సత్కరించి అభివాదం చేస్తున్న ద్రోణంరాజు శ్రీనివాస్ దీనిపై దాడి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదనీ, తన రాజకీయ అనుభవంలో ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వాన్ని చూడలేదని చెప్పారు. గతంలో కొన్ని వర్గాల ప్రజలకే మేలు జరిగేదనీ, కానీ ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలూ జీవితాంతం చెప్పుకునేలా పథకాలు అమలు చేస్తున్నారనీ.. ప్రజలందరి నుంచీ మంచి స్పందన వస్తోందని తెలిపారు. రైతు భరోసా పథకం గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రస్తావించగా.. లక్షలాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో అన్నదాతల్లో ఎనలేని సంతోషం కనిపిస్తోందనీ దాడి చెప్పారు. -
ఘనంగా ఎంపీ మాధవి వివాహం
-
ఘనంగా ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం
సాక్షి, విశాఖపట్నం: అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్ వివాహం ఘనంగా జరిగింది. కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో ఎంపీ మాధవి స్వగృహంలో గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) జరిగిన ఈ పెళ్లికి బంధుమిత్రులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మేళతాళాలు, రంగు రంగుల విద్యుత్ దీపాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి మాధవి తండ్రి, మాజీ ఎమ్మెల్యే దేముడు అభిమానులు శరభన్నపాలెం తరలి వచ్చారు. పెళ్లిబాజాలు మోగే వరకు వధూవరుల్ని ఒక చోటకి తీసుకురాకపోవడం అక్కడి సంప్రదాయం కావడంతో.. ముహూర్తానికి గంట ముందు పెళ్లికుమారుడిని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. దీంతో మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గురువారం రోజంతా సందడి వాతావరణం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు. (చదవండి: ఒప్పించారు ఒక్కటయ్యారు) -
మాధవి పరిణయ సందడి
గొలుగొండ, కొయ్యూరు: అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి పెళ్లిపీటలెక్కారు. గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) తన చిన్ననాటి స్నేహితుడు కుసిరెడ్డి శివప్రసాద్‌తో మాధవి వివాహం వేడుక వైభవంగా జరగనుంది. దీంతో మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గురువారం రోజుంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ జంటను ఆశీర్వదించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల రాకతో గ్రామాలు కళకళలాడాయి. పెళ్లిబాజాలు మోగే వరకు వధూవరుల్ని ఒక చోటకి తీసుకురాకపోవడం అక్కడి సంప్రదాయం కావడంతో.. ముహూర్తానికి గంట ముందు పెళ్లికుమారుడిని తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు. -
ఎంపీ మాధవి వివాహానికి సీఎంకు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తన వివాహానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. తనకు కాబోయే భర్త శివప్రసాద్‌తో కలిసి ఆమె తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న (శుక్రవారం) ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నెల 17వ తేదీన జరిగే తమ పెళ్లికి రావాలంటూ సీఎం జగన్‌కు వివాహా ఆహ్వాన పత్రికను అందచేశారు. కాగా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఎంపీ మాధవి వివాహం జరగనుంది. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్‌ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేశారు. చదవండి: అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్ 17న అరకు ఎంపీ వివాహం -
అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్
సాక్షి, విశాఖపట్నం : అతి పిన్న వయసులో పార్లమెంట్లో అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన శివప్రసాద్‌ను పెద్దల అంగీకారంతో విహహం చేసుకోబోతున్నారు. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్‌ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేయనున్నారు. గొలుగొండ మండలం కెడిపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ బి.టెక్, ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం కరస్పాండెట్‌గా ఓ కాలేజ్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందు తమ స్నేహాన్ని, ప్రేమను తెలియజేసేలా ఓ ప్రీ వెడ్డింగ్ వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రేమ ముందు అందరూ సమానమే అని ఈ వీడియో రుజువు అయింది. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి... ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్‌చంద్రదేవ్‌ని ఇంటికి సాగనంపారు. -
17న అరకు ఎంపీ వివాహం
కొయ్యూరు (పాడేరు): అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ వేడుక 17న జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని ఎంపీ సోదరులు మహేశ్, ప్రసాద్ తెలిపారు. తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం, విశాఖలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాగా అరకు లోక్‌సభ స్ధానం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన గొడ్డేటి మాధవి పార్లమెంట్లో అడుగుపెడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత సాధించిన విషయం తెలిసిందే. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి... ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్‌చంద్రదేవ్‌ని ఇంటికి సాగనంపారు. ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న మాధవి (ఫైల్ ఫోటో) -
గిరిజనుడిగా పుట్టాలనుంది: మంత్రి
సాక్షి, అరకు : ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువు చెప్పిస్తే, ఈనాడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగమిచ్చారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం అరకులో ఏపీ టూరిజం యాత్రి నివాస్ హోటల్లో రెండు కోట్లతో నిర్మించిన డైనింగ్ రెస్టారెంట్‌ను స్థానిక ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తేరు గన్నెల , పద్మాపురం గ్రామాలకు చెందిన సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, టీడీపీకి చెందిన 211 కుటుంబాల కార్యకర్తలు మంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాక్సైట్ మైనింగ్‌ను రద్దు చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అని అభినందించారు. గిరిజనులకు మెడికల్ కాలేజ్, గిరిజన యూనివర్సిటీ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రిదని ప్రశంసించారు. అన్ని గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రూ.156 కోట్లతో అరకు టూరిజం కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడున్నది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని చెప్పారు. గిరిజనులు అమాయకులనీ, మళ్లీ జన్మంటూ ఉంటే గిరిజనుడిగా పుట్టాలనుందని అన్నారు. ఎంపీ మాధవి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి ఆశీస్సుల వల్ల చిన్న వయసులోనే ఎంపీ కాగలిగానని ఆనందం వ్యక్తం చేశారు. భారత టూరిజం శాఖ పార్లమెంటు కమిటీలో తాను మెంబరుగా ఉన్నాననీ, అరకు టూరిజంను దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేస్తానని వెల్లడించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. అరకును దత్తత తీసుకొని చంద్రబాబు అంధకారంలో ఉంచారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరకు నియోజకవర్గానికి 39 రోడ్లను మంజూరు చేశారని, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు విడుదల చేశారని తెలిపారు. ప్రభుత్వం తనకిచ్చిన క్వార్టర్‌ను గిరిజన మహిళల కోసం ప్రసూతి హాస్టల్‌గా మార్చానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ కూడా పాల్గొని మాట్లాడారు. -
టీడీపీతో ఎలాంటి సంబంధం లేదు: ఎంపీ
రాజమహేంద్రవరం: టీడీపీతో తనకు ఎలాంటి సంబంధం లేదని విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం గిరిజన ప్రజా ప్రతినిధులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రివిలేజ్ కమిటీ ముందు పెడతానని తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశానికి హాజరుకాబోనని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 మందితో ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలిలో కొత్తపల్లి గీతకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలావుంటే.. గీత ఎస్టీ కాదని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని.. అయినా కూడా 2014 ఎన్నికల్లో ఎస్టీగా అరకు నుంచి పోటీ చేసి గెలుపొందారని, అందువల్ల ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ కొత్తపల్లి గీత ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేయాలంటూ గీత దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో కొట్టేసింది. 2014 ఎన్నికల్లో అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి ఆమె ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
రాజ్‌నాథ్‌ను కలిసిన ఎంపీ కొత్తపల్లి గీత
న్యూఢిల్లీ: అరకు ఎంపీ కొత్తపల్లి గీత శుక్రవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న తమ భూమి విషయంలో నెలకొన్న వివాదంపై హోంమంత్రికి వివరించినట్టు ఆమె తెలిపారు. ఆ భూమికి సంబంధించి తమకు అనుకూలంగా హైకోర్టు రెండు ఆర్డర్లు ఇచ్చిందని గీత పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాదారాలను ప్రభుత్వానికి అందించినట్టు ఆమె తెలిపారు. అయితే రెవెన్యూ శాఖ తమ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని కొత్తపల్లి గీత ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని హోం మంత్రిని కోరినట్టు ఆమె తెలిపారు. దీనిపై త్వరలోనే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించనున్నట్టు కొత్తపల్లి గీత పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గంలో అత్యంత విలువైన భూములను దక్కించుకునేందుకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పీఆర్కే రావు అడ్డదారులు తొక్కి, ఇందుకోసం తప్పుడు పత్రాలు సృష్టించారు. రిజిస్ట్రార్‌ను ప్రలోభపెట్టి వాటిని ధ్రువీకరింపజేసుకున్నారు. ఎనిమిది కంపెనీలు పెట్టి భూములను వాటి పేరున బదలాయించుకున్నారు. నకిలీ సేల్డీడ్లు హామీగా పెట్టి రుణం తీసుకుని బ్యాంకునూ మోసం చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో భూమిలో కొంత భాగాన్ని ఇతరులకు అమ్మారు. రాయదుర్గంలోని సర్వే నంబర్ 83లో ఉన్న 99.07 ఎకరాల భూములు తమవేనని కొత్తపల్లి గీత చేస్తున్న వాదన అవాస్తవమని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఈ నెల 12న రెవెన్యూ శాఖ నుంచి సేకరించిన పహాణీలో ఆ భూములు.. దాని యజమానులు రుక్ముద్దీన్ అహ్మద్, ఆయన కుటుంబ సభ్యుల పేరిటే ఉన్నాయని తేలింది. ఇక పార్లమెంట్ సభ్యురాలిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న కొత్తపల్లి గీత పేరిట నిబంధనలకు విరుద్ధంగా రెండు పాన్‌కార్డులు ఉన్న విషయం బయటపడింది. -
కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు సమన్లు
హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం రుణం పొందారని ఆమెపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. సుమారు రూ.42 కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు మోపింది. హైదరాబాద్‌కు చెందిన విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నాటి మేనేజింగ్ డెరైక్టర్, తన భర్త అయిన పి.రామకోటేశ్వరరావుతో కలసి గీత ఈ మోసానికి పాల్పడినట్లు చార్జిషీట్లో పేర్కొంది. హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టులో ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. వీరు తప్పుడు ధ్రువపత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించింది. అనంతరం నిందితులు రుణ మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించి బ్యాంకును మోసం చేశారని, ఫలితంగా బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్కే గౌర్ చెప్పారు. బ్యాంకు అధికారులు కేకే అరవిందక్షణ్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెడ్ ఆఫీస్‌లోని నాటి జనరల్ మేనేజర్), బీకే జయప్రకాశం(అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్)లతో నిందితులు కుమ్మక్కై ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారంటూ వీరి పేర్లను కూడా సీబీఐ చార్జిషీట్లో పొందుపర్చింది. నిందితులపై సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర) రెడ్‌విత్ 420 (చీటింగ్), 468 (ఫోర్జరీ), ఐపీసీ 471 కింద, పీసీ యాక్ట్ 1988లోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) కింద అభియోగాలు నమోదు చేసినట్లు గౌర్ తెలిపారు. -
ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీటు
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినట్లు అభియోగాలు రూ. 42 కోట్ల మేర నష్టం కలిగించారని ఆరోపణ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రూ.42 కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నాటి మేనేజింగ్ డెరైక్టర్, తన భర్త అయిన పి.రామకోటేశ్వరరావుతో కలసి గీత ఈ మోసానికి పాల్పడినట్లు చార్జిషీట్లో పేర్కొంది. హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కోర్టులో ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. వీరు తప్పుడు ధ్రువపత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించింది. అనంతరం నిందితులు రుణ మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించి బ్యాంకును మోసం చేశారని, ఫలితంగా బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్కే గౌర్ చెప్పారు. బ్యాంకు అధికారులు కేకే అరవిందక్షణ్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెడ్ ఆఫీస్‌లోని నాటి జనరల్ మేనేజర్), బీకే జయప్రకాశం(అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్)లతో నిందితులు కుమ్మక్కై ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారంటూ వీరి పేర్లను కూడా సీబీఐ చార్జిషీట్లో పొందుపర్చింది. నిందితులపై సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర) రెడ్‌విత్ 420 (చీటింగ్), 468 (ఫోర్జరీ), ఐపీసీ 471 కింద, పీసీ యాక్ట్ 1988లోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) కింద అభియోగాలు నమోదు చేసినట్లు గౌర్ తెలిపారు. వీరికి ఫోర్జరీ పత్రాలు అందించడంలో సాయం చేసిన ఎస్.రాజ్‌కుమార్ అనే ప్రైవేటు వ్యక్తిని, విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీని కూడా చార్జిషీట్లో చేర్చారు. లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీపై నకిలీ పత్రాలు సృష్టించేందుకు నిందితులు ప్రైవేటు వ్యక్తితో కుమ్మక్కయ్యారని సీబీఐ పేర్కొంది. కాగా, ఈ చార్జిషీట్ గురించి తనకు తెలియదని గీత పీటీఐకి ఫోన్లో చెప్పారు. నిధుల స్వాహా కేసు సీబీఐకి.. అనంతపురం అర్బన్: అనంతపురం అర్డీఓగా ఉంటూ రూ.40 లక్షల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన కేసులో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన కొత్తపల్లి గీత కేసు విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అనంతపురం ఆర్డీఓగా గీత 2003 నుంచి 2004 వరకు పని చేశారు. అప్పట్లో ప్రభుత్వ నిధులు రూ.40 లక్షలను తన భర్త ఖాతాలోకి మళ్లించారు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి కలెక్టర్ వైవీ అనూరాధ 2004 ఫిబ్రవరి 19న గీతను సస్పెండ్ చేశారు. తర్వాత ప్రభుత్వం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ కేసును విచారణ నిమిత్తం సీబీఐకి అప్పగించినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. -
బోగస్ సర్టిఫికెట్తో ఎంపీ పదవి: వైఎస్సార్సీపీ
అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. పాడేరు ఎమ్మెల్యే గిద్ది ఈశ్వరి, రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి ఫిర్యాదు చేశారు. ఎంపీ గీత సోదరుడు వివేకానందకుమార్ ఎస్టీ కాదన్న డీఎల్ఎస్సీ నివేదికపై ఈనెల 28వ తేదీన కలెక్టర్ విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గీత, ఆమె సోదరుడు గిరిజనులు కారని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అయితే, ఎంపీ గీత సోదరుడి కులం వ్యవహారాన్ని గిరిజన సంక్షేమ శాఖ చూసుకుంటుందని కలెక్టర్ వారికి చెప్పారు. కలెక్టర్ నీతూకుమార్ ప్రసాద్ సమాధానంతో ఎమ్మెల్యేలు రాజేశ్వరి, ఈశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ గీత ఎస్టీ కాదన్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ సర్కారు కుట్రపన్నుతోందని ఈశ్వరి ఆరోపించారు. చంద్రబాబు కుట్రను గిరిజనులమంతా కలిసి ఎదుర్కొంటామని ఈశ్వరి చెప్పారు. బోగస్ సర్టిఫికెట్తో ఎంపీ పదవిని అనుభవిస్తూ గీత గిరిజనులను మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. -
కొత్తపల్లి గీతకు చేదు అనుభవం
విశాఖపట్నం: అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. నందివలసలో సోమవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమెను గిరిజనులు నిలదీశారు. హుదూద్ తుపాను వచ్చిన మూడు వారాల తర్వాత అరకులో కనిపించిన ఎంపీని కడిగిపారేశారు. ఈ మూడు వారాల్లో కనీసం తమను పలకరించడానికి రాని ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను సాయం అందలేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. గిరిజనులు నిలదీయడంతో ఎంపీ అవాక్కయ్యారు. -
కొత్తపల్లి గీత కులంపై వివాదం: హైకోర్టు విచారణ
హైదరాబాద్ : అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరపనుంది. అరకు లోక్‌సభ నియోజక వర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తపల్లి గీత పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల సందర్భంగా గీత నామినేషన్ వేసేటపుడు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు పొందుపరిచారంటూ ఎన్నికల సమయంలోనే అరకు నుంచి టీడీపీ తరపున లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన గుమ్మడి సంధ్యారాణి పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో తదుపరి విచారణను కోర్టు గురువారం చేపట్టనుంది. ఇదే విషయంపై గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ కొత్తపల్లి గీతపై తాను ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడం వాస్తవమేనన్నారు. ఆమె ఎస్టీ కాదని తాము ఫిర్యాదు చేశామని, కొత్తపల్లి గీత లేదా ఆమె తరపు న్యాయవాది గురువారం కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపినట్లు చెప్పారు. -
ఎంపీ కొత్తపల్లి గీతకు అరెస్ట్ వారెంట్
హైదరాబాద్: విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతాకు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సోమవారం ఆమెకు ఈ వారెంట్ జారీ చేసింది. కొత్తపల్లి గీత... విశ్వేశ్వరయ్య ఇన్ఫ్రాస్టక్చర్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న ఆమె ఇచ్చిన చెక్కు చెల్లలేదు. దీంతో చెక్కు అందుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే కేసు విచారణ నిమిత్తం కొత్తపల్లి గీత కోర్టుకు హాజరు కాకపోవటంతో కోర్టు వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. -
అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వైఎస్సాఆర్ సీపీ ఫైర్
-
కళంకితురాలికి కేబినెట్ పదవా?
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యేలు హైదరాబాద్: తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సబబు కావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, రాజన్నదొర, రాజేశ్వరిలు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మిని కలసి ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... ఎంపీ గీత అసలు ఎస్టీ కాదని, అలాంటప్పుడు ఆమెను పదవి నుంచి తొలగించి తగిన చర్యలు చేపట్టాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధతో జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించేందుకు కేంద్రానికి సిఫార్సు చేయాలని చూడడం సిగ్గుచేటని విమర్శించారు. సాధారణ ఎంపీగా ఉండేదానికన్నా కేబినెట్ ర్యాంకు హోదాను పొందితే ప్రజా ధనాన్ని దోచుకోవచ్చనే దుర్బుద్ధితోనే కొత్తపల్లి గీత టీడీపీతో కుమ్మకైందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది వ్యక్తిగత లబ్ధికోసమే ఆమె తెలుగుదేశం పంచన చేరారని వారు దుయ్యబట్టారు. -
లోక్‌సభలో ఆకట్టుకున్న కొత్తపల్లి గీత ప్రసంగం
న్యూఢిల్లీ: ఆకాశానంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత కోరారు. లోక్‌సభలో తొలిసారిగా మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ధరల గురించి ప్రస్తావించారు. తమ బతుకులను బాగుచేస్తారనే నమ్మకంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు సంపూర్ణ మెజారిటీతో అధికారం కట్టబెట్టారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మోడీ సర్కారు ఉందన్నారు. ధరల పెరుగుదలను అరికట్టి సామాన్యులపై భారం తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల వ్యవస్థను సంస్కరించాలని సూచించారు. దేశమంతా 'ఒకే ధర' విధానాన్ని అమలు చేయాలని కోరారు. తొలిసారిగా లోక్‌సభలో మాట్లాడిన కొత్తపల్లి గీత ఏ మాత్రం తొణక్కుండా తాను చెప్పాల్పింది చెప్పారు. ఆమె ప్రసంగాన్ని సభ్యులు శ్రద్ధగా విన్నారు. ఆమె లోక్‌సభలో మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ స్థానంలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ ఉండడం విశేషం. -
లోక్‌సభలో ఆకట్టుకున్న కొత్తపల్లి గీత ప్రసంగం
-
వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదు:కొత్తపల్లి గీత
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడతానని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని.. అవన్నీ ఊహాగానాలేనని అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉండి పార్టీకి, ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కొత్తపల్లి గీత.. ఫిరాయింపు ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని తాను అనుకోవడం లేదన్నారు. ఏడాదిన్నర క్రితమే అరకు పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయమని వైఎస్ జగన్ తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె మరోమారు గుర్తు చేశారు. పార్టీలో ఉండి చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఎస్టీ పార్లమెంటు సభ్యురాలిని తానేనన్నారు. వైఎస్సార్ సీపీని వీడతానని వార్తల రావడం బాధాకరమన్నారు.