ఎంపీ మాధవి వివాహానికి సీఎంకు ఆహ్వానం | Araku MP Goddetti Madhavi Invites CM YS Jagan For Her Marriage | Sakshi
Sakshi News home page

ఎంపీ మాధవి వివాహానికి సీఎంకు ఆహ్వానం

Published Sat, Oct 12 2019 7:00 PM | Last Updated on Fri, Oct 18 2019 2:08 PM

Araku MP Goddetti Madhavi Invites CM YS Jagan For Her Marriage - Sakshi

సీఎం జగన్‌తో ఎంపీ మాధవి, శివప్రసాద్‌

సాక్షి, తాడేపల్లి: అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తన వివాహానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. తనకు కాబోయే భర్త శివప్రసాద్‌తో కలిసి ఆమె తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న (శుక్రవారం) ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నెల 17వ తేదీన జరిగే తమ పెళ్లికి రావాలంటూ సీఎం జగన్‌కు  వివాహా ఆహ్వాన పత్రికను అందచేశారు. కాగా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఎంపీ మాధవి వివాహం జరగనుంది. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్‌ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్‌ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేశారు. 

చదవండి: 

అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్‌ వీడియో షూట్‌

17న అరకు ఎంపీ వివాహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement