
కాబోయే భర్తతో ఎంపీ మాధవి
కొయ్యూరు (పాడేరు): అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ వేడుక 17న జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని ఎంపీ సోదరులు మహేశ్, ప్రసాద్ తెలిపారు. తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం, విశాఖలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
కాగా అరకు లోక్‌సభ స్ధానం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన గొడ్డేటి మాధవి పార్లమెంట్‌లో అడుగుపెడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత సాధించిన విషయం తెలిసిందే. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి... ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్‌చంద్రదేవ్‌ని ఇంటికి సాగనంపారు.
ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న మాధవి (ఫైల్ ఫోటో)
Comments
Please login to add a commentAdd a comment