
టీడీపీ, బీజేపీలతోనే ఉంటా: కొత్తపల్లి గీత
తాను బీజేపీ, టీడీపీలతో కలిసి పనిచేస్తానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ఇదివరకే చెప్పానన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టే సమావేశాలకు తాను గతంలోనే హాజరయ్యానని, ఇకమీదట కూడా హాజరవుతానని ఆమె తెలిపారు.
తాను తన ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని గీత అన్నారు. ఈ విషయంలో లోక్సభ స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసమే తాను ఎదురు చూస్తున్నానన్నారు.