అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసబ బడ్జెట్ సమావేశాలు మొత్తం 57 గంటల 56 నిమిషాలు జరిగాయి. 14 రోజులపాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 21 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇక పార్టీలువారీగా సభలో ఎవరెవరు ఎంతసేపు మాట్లాడారనేదానికి వస్తే... టీడీపీ ఎమ్మెల్యేలు 42 గంటల 9 నిమిషాలు, వైఎస్‌ఆర్ సీపీ 12 గంటలు, బీజేపీ 3గంటల 32 నిమిషాలు మాట్లాడారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8గంటల 19 నిమిషాలు మాట్లాడగా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3 గంటల 46 నిమిషాలు మాట్లాడారు. అలాగే బీజేఎల్పీ నేత 3 గంటల 13 నిమిషాలు మాట్లాడారు.
కాగా అసెంబ్లీ జరిగిన తీరుపై వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంకు ఎనిమిది గంటలు అవకాశం ఇస్తే, వైఎస్ జగన్‌కు ఇచ్చిన సమయం కేవలం మూడు గంటలా అని ప్రశ్నించారు. ఇక నలుగురు సభ్యులు ఉన్న బీజేఎల్పీ నేతకు ఎంత సమయం ఇచ్చారో... 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్‌కు అంతే సమయం ఇచ్చారని అన్నారు.
ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా
కాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా పరిశ్రమలో శుక్రవారం జరిగిన ప్రమాద ఘటనపై చివరి రోజు వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బాధితులకు న్యాయం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు జవాబు ఇస్తూ జగన్ చదువు గురించి ప్రస్తావిచండంతో సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను నిరవధికంగా వాయిదా వేశారు.
ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా
Published Fri, Mar 31 2017 4:13 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement