సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. తాజాగా రుణాల పేరిట బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ఈ శిక్ష ఖరారైంది.
ఇదే కేసులో గీతతో పాటు ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించారు. మాజీ ఎంపీకి సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు సీబీఐ కోర్టు రూ.2లక్షల జరిమానా విధించింది. శిక్షలు ఖరారు కావడంతో కొత్తపల్లి గీత సహా నిందితులను బుధవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment