గిరిజన బిడ్డగా ఆదరించారు | Kothapalli Geetha Win In Araku Lok Sabh | Sakshi
Sakshi News home page

గిరిజన బిడ్డగా ఆదరించారు

Published Sat, May 17 2014 12:57 AM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM

గిరిజన బిడ్డగా ఆదరించారు - Sakshi

గిరిజన బిడ్డగా ఆదరించారు

పాడేరు (విశాఖ జిల్లా), న్యూస్‌లైన్ :   వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన తనను తొలి ప్రయత్నంలోనే అరకు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని వారంతా ఆదరించారని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. ఎంపీగా భారీ మెజార్టీతో ఎన్నికైన ఆమె విశాఖపట్నంలోని గాయత్రీ విద్యాపరిషత్ కౌంటింగ్ హాల్ వద్ద శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తనను గెలిపించిన అన్నివర్గాల ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.
 
 16 నెలలుగా నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటించి అందరి సమస్యలు తెలుసుకున్నానన్నారు. అయిదేళ్లపాటు సంక్షేమ కార్యక్రమాలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి పోరాడతానన్నారు. గిరిజనుల పోడు భూములకు పట్టాలు పంపిణీకి చర్యలు చేపడతానన్నారు. కొండకుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేంద్రంతో పోరాడుతానన్నారు. ఈ ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన అన్ని వర్గాల ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement