కొత్తపల్లి గీత నామినేషన్ సక్రమమే.. | kothapalli githa was having the nomination of the wright | Sakshi
Sakshi News home page

కొత్తపల్లి గీత నామినేషన్ సక్రమమే..

Published Tue, Apr 22 2014 2:02 AM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM

కొత్తపల్లి గీత నామినేషన్ సక్రమమే.. - Sakshi

కొత్తపల్లి గీత నామినేషన్ సక్రమమే..

పాడేరు : అరకు లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ పత్రాలు సక్రమమేనని అధికారులు సోమవారం ధ్రువీకరించారు. ఆమెపై పోటీచేస్తున్న కొందరు అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. రిటర్నింగ్ అధికారి వి. వినయ్‌చంద్ దీనిపై సోమవారంవిచారణ జరిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని అడ్డతీగల మండ ల రెవెన్యూ అధికారులను కూడా వాకబు చేసిన అనంతరం కొత్తపల్లి గీత ఎస్టీ ధ్రువపత్రం సక్రమమేనని అధికారులు ప్రకటిస్తూ ఆమె నామినేషన్‌ను ఆమోదించారు.

కొత్తపల్లి గీతను వాల్మీకి కులస్తురాలుగా గుర్తించి 2002లో హైకోర్టు తీర్పిచ్చినప్పటికీ ఫిర్యాదు చేయడంపై స్థానికంగా నిరసన వ్యక్తమైంది. తమకున్న ప్రజాదరణ, కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కొత్తపల్లి గీత విజయం ఖాయమనే భావన జీర్ణించుకోలేక ఇలాంటి తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని గిరిజన వర్గాలు ఆరోపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement